కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి రోజు ప్రతినిధుల సభ, పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై నేతలు దిశానిర్దేశం చేయనుండగా… రెండో రోజు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై చర్చించనున్నారు.
ఏడాది పాలనపై 14 ముసాయిదా తీర్మానాల రూపకల్పన
1.ఎన్డీయే కూటమి ప్రభుత్వం- తొలి ఏడాదిలోనే ఘనవిజయాలు. 2.శరవేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం(నదుల అనుసంధానం, బనకచర్లకు గోదావరి జలాలు),3.ఒకే రాజధాని అమరావతి-అభివృద్ధి వికేంద్రీకరణ
(పొరుగు రాష్ట్రాలకు ధీటుగా ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, పట్టణ.. గ్రామీణాభివృద్ధితోనే వికేంద్రీకరణ, పెట్టుబడుల వికేంద్రీకరణ, 175 నియోజకవర్గాలకు 175 పారిశ్రామిక పార్కులు, జగన్ పాలనలో దోపిడీకి గురైన ఉత్తరాంధ్ర, రాయలసీమ, 4.విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు, 5.మహిళా, యువత సంక్షేమానికి పెద్దపీట, 6.సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం, 7.కట్టుదిట్టంగా శాంతిభద్రతలు(ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ, మాఫియాపై కేసులు..అరెస్ట్ లు, 8.చంద్రన్న విజన్ తో సంక్షేమ రాజ్యం (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో వెలుగులు నింపుతున్న ప్రభుత్వం, అన్ని వర్గాలకు సమప్రాధాన్యం), 9.మౌలిక సదుపాయాల అభివృద్ధి.. కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు (రహదారుల అభివృద్ధి, సమగ్ర గృహ నిర్మాణం, పోర్టులు, విమానాశ్రయాల అభివృద్ధి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు), 10.పేదరికం లేని సమాజ సంకల్పంతో పీ4, 11.సాకారమైన విజన్ 2020.. స్వర్ణాంధ్ర విజన్@2047 సాధన దిశగా, 12.విద్యుత్ రంగంలో విప్లవాత్మక విజయాలు, 13.విపక్ష నేతగా కూడా విఫలమైన జగన్, 14.సహజ వనరుల పరిరక్షణ-అక్రమార్కులపై చర్యలు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి ఆయా ముసాయిదా తీర్మానాలకు ఆమోదం తెలుపనున్నారు.
ఉమ్మడి తీర్మానాలు
మహానాడులో 4 ఉమ్మడి తీర్మానాలపైనా చర్చించనున్నారు. 1.తెలుగువారి చరిత్రలో అన్న ఎన్టీఆర్ ప్రత్యేకత,
2.తెలుగువారి చరిత్రలో చంద్రన్న మైలురాళ్లు/ముద్ర, 3.అమరులైన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు ఘన నివాళి,
4.కార్యకర్తల సంక్షేమం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి ఆయా తీర్మానాలను మహానాడు ఆమోదించనుంది.
రాయలసీమ అభివృద్ధిపైనా ప్రత్యేక చర్చ
దశాబ్దాలుగా రాయలసీమ అభివృద్ధి కోసం ప్రస్తుతం, గత టీడీపీ ప్రభుత్వాలు చేసిన కృషిపైనా కడప మహానాడులో ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఫ్యాక్షన్ కట్టడితో పాటు వెనుకబడిన రాయలసీమను సస్యశ్యామలం చేసందుకు హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి లిఫ్ట్ వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టి పూర్తిచేయడం జరిగింది. అనంతపురం జిల్లాకు సాగు, త్రాగు నీరిచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమలో కరవు నివారణకు టీడీపీ హయాంలోనే కృషిచేశాయి. 2014 నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.12వేల కోట్లు ఖర్చుచేయడం జరిగింది. రాయలసీమలో ఓ వైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మరోవైపు పారిశ్రామికీకరణకు పెద్దపీట వేయడం జరిగింది. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్, కర్నూలులో ఓర్వకల్ హబ్, అనంతపురం జిల్లాలో కియా, విండ్ పవర్, సోలార్ ద్వారా లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు టీడీపీ కృషిచేయడం జరుగుతోంది. రాయలసీమలో హార్టికల్చర్, పరిశ్రమలు, డెయిరీలను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదే. వీటన్నిటిపైనా మహానాడు వేదిక ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ సేకరణ!
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలోనే పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వృద్ధాప్య పెన్షన్ ను రూ.4 వేలకు పెంచడం జరిగింది. దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు అందించడం జరుగుతోంది. దీపం పథకం 2 ద్వారా కోటి మంది మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందించడం జరుగుతోంది. అన్న క్యాంటీన్ల ద్వారా పేదవారి ఆకలి తీరుస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ద్వారా రాష్ట్రానికి పెద్దఎత్తున వస్తున్న పరిశ్రమలతో యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం కృషిచేయడం జరుగుతోంది. డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటన్నిటిపైనా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడంతో పాటు మేనిఫెస్టో హామీల అమలుపైనా రెండో రోజు మహానాడులో చర్చించనున్నారు.

