telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వేడుక తరువాత పార్టీలో “సరిలేరు నీకెవ్వరు” టీం పార్టీ

SN

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన తాజా చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు. అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం ఎల్బీ స్టేడియంలో ఘ‌నంగా జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌రు అయ్యారు. చిత్ర బృందం అంతా వేడుక‌లో పాల్గొన్నారు. వేడుక పూర్తైన త‌ర్వాత స‌రిలేరు నీకెవ్వ‌రు టీం పార్టీ మూడ్‌లోకి వెళ్ళారు. ఈవెంట్‌కి రాలేక‌పోయిన మ‌హేష్ భార్య నమ్ర‌త పార్టీలో వీరితో జాయిన్ అంది. అంద‌రు గ్రూపులుగా ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుండ‌గా, ఇందులో ర‌ష్మిక మంథాన క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Related posts