telugu navyamedia
సాంకేతిక

రిలయన్స్ జియో డబుల్ ధమాకా ఆఫర్స్

relaince

రిలయన్స్ జియో డేటా వోచర్ ప్లాన్లను సవరించింది. రూ.11, రూ.21, రూ.51, రూ.101 4G డేటా వోచర్లపై డబుల్ డేటా ఆఫర్ చేస్తోంది. అదనంగా ఆఫ్ నెట్ నిమిషాలను కూడా అందిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తితో ఇంటి దగ్గర నుంచే పనిచేసే ఉద్యోగులను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ డేటా వోచర్లలో సవరణలు చేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. రూ.11 4G డేటా వోచర్ కింద యూజర్లకు 800MP హైస్పీడ్ 4G డేటాను అందిస్తోంది. అదనంగా 75 నిమిషాల పాటు నాన్ జియో కాల్స్ ఆఫర్ చేస్తోంది. రూ. 21 ప్యాక్‌పై హైస్పీడ్ 4G డేటాపై 2GB వరకు అఫర్ చేస్తోంది. దీనికి అదనంగా 200 వరకు ఆఫ్-నెట్ కాలింగ్ నిమిషాలను పొందవచ్చు. రూ. 51 డేటా వోచర్ కింద యూజర్లకు 6GB హైస్పీడ్ డేటాను అందిస్తోంది. 500 ఆఫ్-నెట్ కాలింగ్ నిమిషాలను అందిస్తోంది. చివరగా రూ.101 ప్లాన్ పై 121 హైస్పీడ్ డేటాతో పాటు 1000 ఆఫ్-నెట్ నిమిషాలను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ బేస్ ప్లాన్ మాదిరిగానే ఉంటుంది. ఈ డేటా ప్లాన్లలో FUP లిమిట్ దాటినప్పటికీ సర్వీసులు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. కానీ, 64kbps తక్కువ స్పీడ్ మాత్రమే ఉంటుందని పేర్కొంది.

Related posts