telugu navyamedia
Uncategorized

ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీంలో పిటిషన్‌!

Supreme Court

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే వాయిదా వేస్తున్నట్లు చేసిన ప్రకటనను ఆక్షేపిస్తూ ఈరోజు పిటిషన్‌ దాఖలు చేసింది.

పిటిషన్ పై స్పందించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత్‌ రేపటి రెగ్యులర్‌ లిస్టులో ఈ కేసును ఉంచాలని ఆదేశించారు. మరోవైపు ఏపీ హైకోర్టులో తాండవ యోగేష్‌, జనార్దన్‌ అనే ఇద్దరు వ్యక్తులు లంచ్‌మోషన్‌లో ప్రైవేటు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ధర్మాసనం అనుమతించడంతో మధ్యాహ్నం విచారణకు వచ్చే అవకాశముంది.

Related posts