పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తో రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన డైరెక్టర్ క్రిష్‌తో తెరకెక్కే భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పవన్ బర్త్‌డే రోజున దీనికి సంబంధించి ప్రకటన వెలువడింది. మొగల్ పరిపాలనా కాలానికి చెందిన ఈ కథలో పవన్ గజదొంగగా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘విరూపాక్ష’, ‘గజదొంగ’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో టైటిల్ తెరమీదకు వచ్చింది. ఈ సినిమాకు ‘ఓం శివమ్’ అనే పేరు పెట్టబోతున్నట్ల గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కెరీర్‌లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
previous post