telugu navyamedia
సినిమా వార్తలు

హార్దిక్ పాండ్యాతో ప్రేమాయణం… గొడవలు అవుతాయంటున్న హీరోయిన్

Urvasi-Rataula

గ్రేట్ గ్రాండ్ మస్తీ , భాగ్ జానీ, హేట్ స్టోరీ వంటి చిత్రాల‌లోను న‌టించి పాపుల‌ర్ అయింది బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ. ఇటీవ‌ల‌ అండ‌మాన్ నికోబార్ ఐలాండ్ ప్ర‌భుత్వం ఈ అమ్మ‌డికి ప్ర‌త్యేక గౌర‌వాన్ని అందించింది. ఐలాండ్‌లోని ఓ పుష్పానికి ఊర్వ‌శీ రౌతెలా పేరు పెట్టింది. ఊర్వ‌శీ ఫ్ల‌వర్స్ అంటూ వాటిని పిలుస్తారంటూ ప్ర‌క‌టించింది. అయితే ఊర్శ‌శీతో హార్ధిక్ పాండ్యా ప్రేమాయ‌ణం న‌డుస్తుంద‌ని కొన్ని ప‌త్రిక‌లు వార్త‌లు ప్ర‌చురిస్తున్నాయి. దీనిపై ఊర్వ‌శి మండిప‌డింది. ద‌య చేసి మీడియా ఛానల్స్ చెత్త వార్త‌ల‌ని ప్ర‌చురించొద్దు. ఇలాంటి వార్త‌ల వ‌ల‌న కుటుంబంలో గొడ‌వ‌లు అవుతాయి. రేప‌టి రోజు ఏదైన జ‌రిగితే నా కుటుంబానికి నేను జ‌వాబు చెప్పుకోలేను అని అంటోంది. పారిశ్రామికవేత్త గౌతం సింఘానియా పార్టీలో హార్ధిక్‌ పాండ్యా, ఊర్వశి కలుసుకున్నారు. అప్పటినుంచీ వీరి రిలేషన్‌ మొదలుకావడంతో ఎల్లీ అవ్రామ్‌, పాండ్యా నుంచి దూరంగా ఉందంటూ ఊహాగానాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత హార్ధిక్- ఊర్వ‌శీ ఫోటోలు వైర‌ల్ కావ‌డంతో వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఉంద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు నెటిజ‌న్స్. హార్ధిక్ పాండ్యాకు ఊర్వశి రౌతెలా, ప‌రిణితి చోప్రా, నటి ఎల్లీ అవ్రమ్‌తో రిలేష‌న్‌లో ఉన్న‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వార్త‌ల‌ని సద‌రు నటీమ‌ణులు అప్ప‌ట్లో ఖండించారు.

Related posts