భారత్, చైనా సైనికుల మధ్య లఢక్‌లోని గాల్వన్ లోయ వద్ద ఇటీవల భారీ ఘర్షణ జరిగిన నేపథ్యంలో టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే భారత ఆర్మీ కూడా కొన్ని కీలక యాప్‌లపై ఆంక్షలు విధించింది.
ఫేస్‌బుక్, టిక్‌టాక్, పబ్‌జీ, ట్రూకాలర్ సహా 89 యాప్స్‌ను తమ మొబైల్స్ నుంచి తొలగించాలని తన సిబ్బందికి భారత ఆర్మీ ఆదేశించింది. కీలకమైన సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది.సమాచారాన్ని ఇతరులకు చేరవేసే అవకాశం ఉన్న 89 యాప్‌లను తమ మొబైల్స్ నుంచి తొలగించాలని ఆర్మీ సిబ్బందిని కోరింది.