మహాశివరాత్రి-2020 మహోత్సవం సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ తన మాజీ భార్య సుజానేఖాన్‌తో కలిసి ముంబై నగరంలోని శివాలయంలో పూజలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. హృతిక్, సుజానేఖాన్ లు 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు జన్మించాక వీరిద్దరూ అభిప్రాయ బేధాలతో 2014లో విడాకులు తీసుకున్నా సెలవులు, విందులకు కలిసి వెళుతుండటం విశేషం. తాజాగా. మహాశివరాత్రి సందర్భంగా సుజానేఖాన్ తన కుమారులైన హ్రీహాన్, హ్రీదాన్‌లతో కలిసి ముంబై నగరంలోని పన్వేల్ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్న తన మాజీ భర్త హృతిక్ రోషన్ వద్దకు వచ్చి భక్తి ప్రపత్తులతో పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో హృతిక్ రోషన్ తల్లిదండ్రులు రాకేష్, పింకీరోషన్ ఇతర కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా హృతిక్ రోషన్ తన కుటుంబంతో కలిసి శివాలయంలో శివుడికి హారతి ఇచ్చి పూజలు చేస్తుంటారు. హృతిక్ తన భార్య సుజానేఖాన్ లు విడాకులు తీసుకున్నా, మహాశివరాత్రి సందర్భంగా కలిసి శివాలయంలో పూజలు చేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది
previous post

