telugu navyamedia
ఆంధ్ర వార్తలు

తిరుపతి రుయా ఆసుపత్రిలో రెచ్చిపొయిన అంబులెన్స్ మాపియా..

*తిరుప‌తి రూయా ఆస్పత్రిలో రెచ్చిపోయిన అంబులెన్స్ మాఫియా..
*మృత‌దేహం త‌రిలింపుకు రూ.20వేలు డిమాండ్‌..
*ఇత‌ర అంబులెన్స్ ఆస్ప‌త్రిలోకి వ‌స్తే అనుమతించ‌ని డ్రైవ‌ర్లు
*కొడుకు మృత‌దేహం 90 కిలోమీట‌ర్లు బైక్‌పై తీసుకెళ్ళిన తండ్రి..

ఆంధ్రప్రదేశ్​లో ని తిరుపతి రుయా ఆస్పత్రిలో అంబులెన్స్ మాఫియా రెచ్చిపోతోంది. అన్నమయ్య జిల్లా చిట్వేలికి చెందిన వ్యక్తి తన పదేళ్ల కుమారుడు జైశ్వ అనారోగ్యంతో ఉండటంతో ఇటీవల తిరుపతి రుయాకు తీసుకొచ్చారు.

అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన బాలుడి జెసవ కిడ్నీ చెడిపోవడంతో చిన్న పిల్లలు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మంగళవారం తెల్లవారు జామున ఆ బాలుడు మృతి చెందాడు.

బాలుడిని తిరుపతి నుంచి 90 కి.మీ. దూరంలో ఉన్న చిట్వేలికి తీసుకెళ్లడానికి రుయా అంబులెన్స్‌ డ్రైవర్లను అడగ్గా.. రూ.20వేలు అవుతుందని చెప్పారు. అంత మొత్తం భరించలేని తండ్రి ఈ విషయాన్ని స్వగ్రామంలో ఉన్న తమ బంధువులకు తెలియజేయడంతో వారు ఉచిత అంబులెన్స్‌ను పంపిస్తే.. రుయా ఆస్పత్రిలోకి రాకుండా అంబులెన్స్ మాఫియా అడ్డుకున్నారు.

దీంతో త‌న కొడుకు జెసవ మృతదేహన్ని ద్విచక్ర వాహనంపై 90 కి.మీ దూరంలోని చిట్వేల్ కు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

రుయా అంబులెన్స్ దందాపై తిరుపతి ఎంపీ గురుమూర్తి స్పందించారు. రుయా ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు వివరించారు.

ఇవాళ ఉదయమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, ఆర్డీఓ లు ఈ ఘటనపై విచారణ నిర్వహించారు. మరో వైపు డీఎస్పీ రుయా ఆసుపత్రిలో విచారణ నిర్వహించారు.

Related posts