telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ రకుల్…

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉద్యమంలా సాగుతోంది. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఆదరణ వస్తోంది. అపూర్వ స్పందనతో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ముందుకు సాగుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు ఎంతో ప్రేమతో మొక్కలు నాటుతున్నారు. తమ ఆత్మీయులను నాటమని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే అక్కినేని హీరో నాగచైతన్య విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీతిసింగ్ స్వీకరించారు. ఈ రోజు జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే, ఎంపీ కాలనీలో మొక్కలు నాటిన రకుల్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒకరిద్దరి కార్యక్రమం కాదు మనందరం కలిసి చేయాల్సిన కార్యక్రమని తెలిపారు. ప్రతీ ఒక్కరు ఈ ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టి ఎంతో బాధ్యతతో ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts