మలయాళ అగ్ర హీరో మమ్ముట్టి ఓ భారీ పీరియాడిక్ డ్రామా 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో తెరకెక్కుతున్న “మమాంగం” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మమ్ముట్టి యుద్ధ వీరుడిగా కనిపించబోతున్నారు. మమాంగం అనే పండుగ సందర్భంగా జరిగే వివాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కేరళ తరహా వస్త్రధారణలో యుద్ధవీరుడిగా మమ్ముట్టి కనిపిస్తున్నారు. ఈ సినిమా మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ మూవీ తొలి షెడ్యూల్‌కు సంజీవ్ పిళ్ళై దర్శకత్వం వహించారు. తర్వాతి షెడ్యూల్ నుంచి ఎం పద్మకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.
previous post

