హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం 2021-22 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలను ఈ నెల 17న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే వివిధ కోర్సులను దరఖాస్తులను స్వీకరించారు అధికారులు.
బీఎఫ్ఏ, ఎంఏ (తెలుగు, హిస్టరీ, జ్యోతిష్యం, జర్నలిజం, కల్చర్ అండ్ టూరిజం) కోర్సులకు యూనివర్సిటీ ప్రాంగణంలోనే ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీ నుంచి www.teluguuniversity.ac.in లేదా www.pstucet.org వెబ్సైట్ల ద్వారా హాల్టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.


