telugu navyamedia
విద్యా వార్తలు

ఉపాధ్యాయుడి దాష్టికం.. ఐదుగురి పిల్లలను చితకబాదిన వైనం..

students misbehave with teacher
విద్యార్థులకు జ్ఞానం బోధించడంలో ఉపాద్యాయుడు తగిన విధానాలను కనుక్కొని ఆయా స్థాయిలకు అనుగుణంగా బోధన చేయటం నాటి గురువులు చేసిన సహజ ప్రక్రియ. అయితే నేడు విపరీతంగా పెరిగిన తరగతిగదిలో విద్యార్థుల సంఖ్యతో అలా ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా పట్టించుకోవడం సాధ్యపడటం లేదు. దానితో చెప్పిన స్థాయిని అందుకొని వారికి తీవ్రమైన శిక్షలు విధిస్తూ, చదువంటే భయాన్ని బోధిస్తున్నారు. ఇలాంటివి రోజు చూస్తూనే ఉన్నాం కూడా. తాజాగా మరొకటి, అద్దంకి మండలం శింగరకొండ వద్ద ఉన్న బాలయోగి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ విద్యార్థినులపై ప్రతాపం చూపింది. హోంవర్కు చేయలేదని వారిని చితకబాదింది. ఐదుగురు విద్యార్థినులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం అద్దంకి వైద్యశాలకు తరలించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉన్నతాధికా రులు విచారణ ప్రారంభించారు. అందిన సమాచారం మేరకు.. శింగరకొండ వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా వెంకాయమ్మ ఔట్‌ సోర్సింగ్‌పై ఐదు నెలల నుంచి పనిచేస్తోంది. గురుకులంలో ఏడో తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులను హోం వర్కు చేయలేదన్న కారణంతో గురువారం ఆమె చితకబాదింది. పరీక్ష ప్యాడ్‌తో కొట్టడంతో క్లిప్‌ ఉన్న వైపు తగిలి ఐదుగురికి గాయలయ్యాయి.
బల్లికురవ మండలం ఎస్‌.ఎల్‌. గుడిపాడుకు చెందిన ఓ బాలిక, అద్దంకి మండలం వెంకటాపురంనకు చెందిన ఓ విద్యార్థినిలను తలపై కొట్టడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ముండ్లమూరు మండలం నూజిళ్లపల్లికి చెందిన మరో విద్యార్థిని భుజం పై గాయాలయ్యాయి. మారెళ్లకు చెందిన విద్యార్థిని తలపై బొప్పి కట్టగా దర్శి మండలం చింతలపాలెం కు చెందిన మరో విద్యార్థినికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచిన గురుకులం అధికారులు గాయపడిన విద్యార్థినులను గురువారం రాత్రి అద్దంకిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు చికిత్స కోసం తరలించారు. దీంతో విషయం బయటకు వచ్చింది.
సమాచారం తెలుసుకున్న ఓ విద్యార్థిని కుటుంబ సభ్యులు గురుకులానికి వచ్చి గురువారం రాత్రి ఆ బాలికను తీసుకువెళ్లారు. ప్రిన్సిపాల్‌ వాసవి జరిగిన సంఘటనను ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తున్న వెంకాయమ్మను విధుల నుంచి తొలగించారు. శుక్రవారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంఈవో విజయకుమార్‌ పాఠశాలలో విచారణ చేపట్టారు. జరిగిన సంఘటనను విద్యార్థినులను అడిగి వివరాలు రాబట్టారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఎంఈవో తెలిపారు.
గత ఏడాది కూడా ఇలాంటి సంఘటన శింగరకొండ వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులంలో చోటుచేసుకుంది, అయినా ఇలాంటి సంఘటనలు పునరావృతమవు తూనే ఉన్నాయి. గత ఏడాది కూడా ఓ ఉపాధ్యాయురాలు కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. ఆ మరుసటి రోజు నుంచి సెలవులు కావడంతో పిల్లలను తీసుకెళ్లేందుకు పాఠశాలకు వచ్చిన తల్లి దండ్రులు విషయం తెలుసుకొని ఆందోళనకు దిగా రు. అప్పట్లో సదరు ఉపాధ్యాయురాలిపై వేటు పడింది. మళ్లీ ఏడాది తిరక్కుండానే ఇప్పుడు కంప్యూ టర్‌ ఇన్‌స్ట్రక్టర్‌ విద్యార్థులను చావబాదడంపై తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Related posts