telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణ ఎంసెట్-2019 పరీక్షలు ప్రారంభం

తెలంగాణ ఎంసెట్‌కు-2019 పరీక్షలకు  అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం నుంచి ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఎంసెట్‌- 2019 పరీక్షలు ఎంసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.  ఇంజినీరింగ్‌ పరీక్షను ఈ నెల 3,4,6 తేదీల్లో, అగ్రికల్చర్‌-ఫార్మసీ పరీక్షను 8,9 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్ట్ ల వారిగా పరీక్షలను నిర్వహిస్తారు.
 ఈ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలో 83 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఇంజనీరింగ్‌ విద్యార్థులు 1,42,218 మంది ఉండగా, అగ్రికల్చర్, ఫార్మసీ కోసం 74,981 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు.

Related posts