సమ్మర్ సీజన్‌లో వేడి ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరం ఎక్కువగా అలిసిపోతుంది.
వేడి వాతావరణంలో ఎక్కువగా డ్రింక్స్ తీసుకుంటాం. దీని వల్ల బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.
అంతేకాదు, శరీరంలో నీటిలో కొరత వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో పచ్చిమామిడితో ఓ డ్రింక్ చేయొచ్చు.
పండిన మామిడి కంటే ఎక్కువ పచ్చిమామిడిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేయాలో తెలుసుకోండి.
వేడి ఎక్కువైతే..
వేడి పెరిగినప్పుడు కడుపులో నొప్పి వస్తుంది. జీర్ణ సమస్యలు వస్తాయి. ఆకలి తగ్గుతుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువగా డ్రింక్స్ తీసుకోవాలి.
ఇందుకోసం కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లోనే హెల్దీ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. అలాంటి వాటిలో పచ్చి మామిడి డ్రింక్ ఒకటి.
పచ్చిమామిడి..
పచ్చిమామిడిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పండిన మామిడి కంటే ఈ పచ్చి మామిడిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
ఇందులో కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు ఉన్నాయి. వీటి వల్ల గ్యాస్, అసిడిటీ సమస్యలు రాకుండా ఉంటాయి.
కావాల్సిన పదా ర్థాలు..
ఇది మామిడి సీజన్. ఈ సీజన్ ఫ్రూట్‌ని తీసుకుని డ్రింక్‌ని హ్యాపీగా చేసుకుని తాగొచ్చు. ఎక్కువగా పులుపులేని మామిడికాయ తీసుకోండి. దీంతో పాటు అల్లం, పచ్చిమిర్చి, నిమ్మ, పుదీనా, ఉప్పు, పంచదార, ఐస్ అవసరం అవుతాయి.
ఎలా చేయాలి..
పచ్చిమామిడిని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం, పచ్చిమామిడి, పచ్చిమిర్చి, పుదీనా వేసి మిక్సీ పట్టండి. తర్వాత ఇందులో నీరు పోయండి.
చివరగా దానిని వడపోసి రుచికి తగ్గట్టు ఉప్పు, పంచదార వేయండి. పై నుంచి కొద్దిగా నిమ్మరసం పిండి, పుదీనా ఆకులతో గార్నిష్ చేయండి.

