telugu navyamedia
ఆరోగ్యం

బార్లీతో అధిక బ‌రువుకు చెక్‌!

బార్లీ ఒక రకమైన‌ గడ్డి జాతి మొక్క‌. బార్లీ గింజలు ఆహారము గాను, ఔషదము గానూ ఉపయోగపడుతుంది. బార్లీ గింజలులో కొలెస్ట్రాల్‌ను బాగా అదుపు చేస్తాయి. రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్‌నూ అదుపు చేసే గుణం ఉండటం వల్ల ఇవి అనే రకాల గుండెజబ్బులనూ, గుండెపోటునూ నివారిస్తాయి. బార్లీలోని విటమిన్‌–ఏ కారణంగా ఇవి కంటిచూపును దీర్ఘకాలం పాటు పదిలంగా కాపాడతాయి. వీటిల్లో ఐరన్‌ కూడా ఎక్కువే. అందువల్ల రక్తహీనతను నివారిస్తాయి.

బార్లీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల పొట్టలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. శరీరం నుండి వ్యర్థాలను ఫ్లష్ అవుట్ చేస్తుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది.బార్లీ వాటర్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్, వికారం తగ్గిస్తుంది, పొట్ట ఉదరంలో దురదను కూడా నివారిస్తుంది.

బార్లీతో ఉప‌యోగాలు :-
*బార్లీ గింజలతో గంజిని తయారుచేసి, మజ్జిగను, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది
* ఈ పానీయాన్ని తీసుకోవటం వలన వేసవి నెలల్లో ఏర్పడే శరీరంలో వేడి తగ్గుతుంది.

* బార్లీని కాల్షియం పదార్థాలతోను, చిక్కుళ్లు, మాంసం, పాలు, కోడిగుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది. వీటిని కలిపి తీసుకోవటం ద్వారా బార్లీలో లేని లైసిన్‌ని భర్తీచేసినట్లవుతుంది.

 

How to have barley (Jau) water for weight loss - Times of India

* బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
* బార్లీ తాగితే కిడ్నీ లో రాళ్లు క‌రిగిపోతాయి.
* బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు బార్లీ నీటిని తాగితే బరువు తగ్గుతారు. బార్లీ నీటి వ‌ల్ల శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ క‌రుగుతుంది.

* బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగినది. దీనిని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీగింజలను, వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి.

*బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది.

* బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో ఫలహారాలను చేసి తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది.

* బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Related posts