telugu navyamedia
ఆరోగ్యం

మామిడిపండు తో కలిపి ఇవి అసలు తినవద్దు.!

పండ్లలో రారాజు మామిడి పండు. వేసవి కాలంలో మాత్రమే దొరుకుతుంది. మామిడి పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. దీని రుచి వేరే మజా ఇస్తుంది.

ఇందులో పుష్కల పోషకాలు ఉంటాయి, ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

మామిడి తినేటప్పుడు కొన్ని పదార్థాలను కలిపి తినడం ఆరోగ్యానికి హానికరంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మామిడి పండుతో కలిపి తినకూడని ఆహారాల వివరాలను తెలుసుకుందాం:

పెరుగు:
మామిడి పండుతో కలిపి పెరుగు తినకూడదు. ఈ రెండు కలిపి తింటే కడుపులో కార్బన్ డై ఆక్సైడ్ పెరుగుతుంది. తద్వారా కడుపునొప్పితోపాటు ఇతర సమస్యలు వస్తాయి.

శీతల పానీయాలు:
రాత్రిపూట భోజనంలో మామిడిపండు తింటున్నట్లయితే దాంతోపాటు శీతల పానీయాలు తీసుకోవద్దు. ఈ రెండింటిని కలిపి తీసుకోవడంవల్ల జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది.

కారంగా ఉండే ఆహారం:
మామిడిపండును రాత్రిపూట భోజనంలో లేదంటే మధ్యాహ్న భోజనంలో తినడానికి చాలామంది ఇష్టపడతారు. మామిడి తిన్న వెంటనే కారంగా ఉండే ఆహారం తినకూడదు. అలాగే పచ్చి మిరపకాయలను మామిడి కాయతో కలిపి తినకూడదు. తింటే కడుపులో చికాకు కలుగుతుంది. విరోచనాలు అవుతాయి.

చేదు పదార్థాలు:
మామిడికాయతో కాకరకాయ కలిపి తినకూడదు. అలా తింటే విషతుల్యం అవుతుంది.

నీళ్లు తాగొద్దు:
మామిడి పండు తిన్న వెంటనే నీళ్లు తాగొద్దు. తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి చేస్తుంది.

ఐస్ క్రీమ్:
ఐస్ క్రీమ్ తో కలిపి మామిడి తినకూడదు. మామిడిలో సహజ చక్కెర ఉంటుంది. బ్లడ్ లో షుగరు లెవల్స్ పెరుగుతాయి. కడుపు కు సంబంధించిన సమస్యలు రావడంతోపాటు జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది.

Related posts