telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

రోజూ పరగడుపునే ఇవి తింటే… ఎన్నో ప్రయోజనాలు

పురాతన కాలం నుంచి భారతీయుల వంటి ఇంటి దినుసుల్లో మెంతులు ముఖ్య పాత్ర పోషిస్తూ వస్తున్నాయి. వీటిని అనేక వంటల్లో రుచి, సువాసన కోసం వేస్తుంటారు. అయితే వాటికే కాక మనకు ఆరోగ్యకర ప్రయోజనాలను అందించడంలోనూ మెంతులు పనికొస్తాయి. గుప్పెడు మెంతులను తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగి మెంతులను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మెంతులను పరగడుపునే తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. లివర్ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, అసిడిటీ, అల్సర్లు నయమవుతాయి. మలబద్దకం దూరమవుతుంది.
2. మెంతులను రోజూ తినడం వల్ల శరరీంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ పోతుంది. దీని వల్ల అధిక బరువు తగ్గుతారు.
3. చర్మాన్ని మృదువుగా మార్చే ఔషధ గుణాలు మెంతుల్లో ఉంటాయి. చర్మంపై ఉండే మచ్చలు పోయి చర్మం కాంతివంతంగా మారుతుంది. నొప్పులు, వాపులు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. దీంతో ఎప్పటికీ యవ్వనంగా కనిపిస్తారు.
4. పసిపిల్లలకు పాలిచ్చే తల్లులు మెంతులను తింటే వారిలో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి.
5. మధుమేహం ఉన్నవారికి మెంతులు వరమనే చెప్పవచ్చు. మెంతులను తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
6. జ్వరం, రుతు సమస్యలు, గొంతు నొప్పి, ఇన్‌ఫెక్షన్లు ఉన్న వారు మెంతులను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Related posts