telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సెల్ఫీ నెం.1 ఇది… : దేవిశ్రీ ప్రసాద్

Devisri

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్, సూపర్‌స్టార్‌తో కలిసి దిగిన సెల్ఫీని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. కార్యక్రమానికి హాజరైనందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలియజేశాడు. “సెల్ఫీ నెం.1 ఇది. `సరిలేరు నీకెవ్వరు` ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవిగారికి ధన్యవాదాలు. ఇక, డియర్ మహేష్.. నా మీద మీరు ఉంచిన నమ్మకానికి, అభిమానానికి ధన్యవాదాలు” అంటూ దేవి పేర్కొన్నాడు.

Related posts