భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు కొత్తగా 7,554 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి 223 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకు గురి చేస్తుంది.
ఇప్పటి వరకూ దేశంలో కరోనా బారిన పడి 4,23,38,673 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు కూడా తగ్గుతున్నాయి.
ప్రస్తుతం దేశంలో 85,680 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. భారత్ లో ఇప్పటి వరకూ 42,938,599 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 5,14,246 మంది మరణించారు.
మరోవైపు..దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. మంగళవారం మరో 8,55,862 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,77,79,92,977కు చేరింది.

