గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని వినాయక విగ్రహాలను బేబీ పాండ్స్, చెరువులో వేసే సందర్భంలో పద్ధతి ప్రకారంగా విగ్రహాలను బయటకు తరలించాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి పీపుల్స్ ప్లాజా లో నిర్వహిస్తున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… గణేష్ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేస్తున్న సందర్భంగా పూజ పూర్తయిన తర్వాత పూజా సామాగ్రిని చెరువులో వేయకుండా సపరేట్ గా ఒక ప్రాంతంలో వేసేందుకు చర్యలు తీసుకోవాలని శానిటేషన్ అదనపు కమిషనర్ ను ఆదేశించారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఏర్పడే స్కార్ఫ్ ను వెను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అంతేకాకుండా శానిటేషన్ సిబ్బంది 24 గంటల పాటు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కమిషనర్ వెంట ఈ ఎన్ సి జియా ఉద్దీన్, జోనల్ కమిషనర్లు వెంకటేష్ దోత్రె, అడిషనల్ కమిషనర్ రవి కిరణ్, శానిటేషన్ అదనపు కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.