telugu navyamedia
రాజకీయ వార్తలు

మిలీనియల్స్‌ క్యాబ్‌లకే యువత మొగ్గు: నిర్మలా సీతారామన్‌

Nirmala seetharaman

ఆధునిక యువత మిలీనియల్స్‌ క్యాబ్‌లకే మొగ్గు చూపుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దీంతో ఆటోమొబైల్‌ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని చెప్పారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు యువత ఇష్టపడటం లేదని అన్నారు.

ఆటోమొబైల్‌ రంగంలో సంక్షోభాన్ని సమర్ధంగా చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. భారత్‌ 6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్‌ రుసుము అంశాలతో పాటు యువత ఎక్కువగా క్యాబ్‌లు, మెట్రో రైళ్లపై ఆధారపడటంతో కూడా ఆటోమొబైల్‌ రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఆటో సంక్షోభం సమసిపోయేందుకు ప్రభుత్వం అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు.

Related posts