telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సున్నిపెంట ప్రజావేదికకు హాజరైన సీఎం చంద్రబాబు..

రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం, గత ఐదేళ్లు ప్రాజెక్టులను పట్టించుకోలేదు, మొన్నటి ఎన్నికలు ఒక సునామీని తలిపించాయి, ఒక్కో స్థానంలో అత్యధిక మెజారటీ సాధించాం.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం  ఖజానా ఖాళీగా ఉన్నా ఒక్కొక్క హామీని నెరవేరుస్తాం.

నీరు సంపదను సృష్టిస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, సంపద సృష్టితో పేదరిక నిర్మూలన సాధ్యం.

పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి, గత ఐదేళ్లలో విధ్వంసం సృష్టించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం, హార్టీకల్చర్‍కు ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తాం.

పండ్ల తోటల సాగు విస్తీర్ణాన్ని పెంచుతాం, స్కిల్ డెవలప్‍మెంట్‍తో ఉద్యోగాలు కల్పిస్తాం,  ప్రాజెక్టుల కోసం రూ.68 వేల కోట్లు ఖర్చు చేశాం, గత పాలకులు దోచుకున్నారు, దాచుకున్నారు.

శ్రీశైల క్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తాం, ప్రపంచం మొత్తం శ్రీశైలం వైపు చూడాలి : సీఎం చంద్రబాబు

Related posts