telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపు అమరావతికి రానున్న ఐఐటీ నిపుణులు, గతంలో నిలిచిపోయిన భవనాల సామర్థ్యతను అధ్యయనం చేయనున్న ఇంజినీర్లు.

రాజధానిలో అసంపూర్తిగా నిలిచిన కట్టడాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకుఐఐటీ నిపుణులు రాష్ట్రానికి రానున్నారు.

2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలోనే నిలిచిపోయిన భవనాలు కొన్ని ఉండగా…మరికొన్ని ఫౌండేషన్ పనులు పూర్తి చేసుకుని అసంపూర్తిగా మిగిలిపోయాయి.

అలాంటి నిర్మాణాల విషయంలో ఎలా ముందుకెళ్లాలని దానిపై ఐఐటి ఇంజినీర్లతో అధ్యయనం చేయిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.

2019 కు ముందు నిర్మాణాలు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన వాటి స్థితిగతులను అధ్యయనం చేసేందుకు ఐఐటి నిపుణులు రాష్ట్రానికి రానున్నారు. ఆయా నిర్మాణాల పటిష్టత, ఇతర టెక్నికల్ అంశాలను ఐఐటి ఇంజినీర్లు పరిశీలించనున్నారు…

సెక్రటేరియట్,హెచ్ వోడి కార్యాలయాల టవర్లతో పాటు హై కోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలు పెట్టింది.

దీనికోసం భారీ ఫౌండేషన్ లతో పునాదులు కూడా వేసింది..అయితే పునాదుల దశలోనే ఆయా నిర్మాణాలు నిలిచిపోయాయి.

ఈ భవనల ఫౌండేషన్ సామద్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాస్ కు అప్పగించింది..ఇక ఐఏఎస్ అధికారుల నివాసాలు,మంత్రులు,ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం.

ఐఐటీ మద్రాస్,ఐఐటీ హైదరాబాద్ ల నుంచి ఇద్దరేసి ఇంజినీర్ల బృందాలు రేపు(శుక్రవారం)అమరావతికి రానున్నాయి.

రెండు బృందాలు రెండు రోజులపాటు అమరావతిలో పర్యటించి ఆయా కట్టడాల ను పరిశీలించి వాటి నాణ్యత,సామర్థ్యాన్ని అంచనా వేయనున్నాయి.

అమరావతి పర్యటన లో భాగంగా సీఆర్డీయే అధికారులతో రెండు బృందాల్లోని ఇంజినీర్లు విడివిడిగా సమావేశం కానున్నారు.

Related posts