telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎయిర్ పోర్టులో అభిమానులను చూసి భయపడిపోయిన సన్నీ… వీడియో వైరల్

Sunny

బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోనీ నిన్న విహారయాత్ర నుంచి తన భర్త డేనియల్ వెబర్‌తో కలిసి సన్నీ ముంబయిలో అడుగుపెట్టారు. అక్కడ ఫ్యాన్స్ సన్నీతో సెల్ఫీ దిగాలని ఎదురుచూస్తున్నారు. ఎప్పుడూ ఫ్యాన్స్‌ని ఆప్యాయంగా పలకరించే సన్నీ ఈసారి మాత్రం వారిని దూరంపెడుతున్నట్లు ప్రవర్తించారు. ఇందుకు కారణం ప్రపంచాన్ని హడలుకొడుతున్న కరోనా వైరసే. అవును, అసలే చైనాలో ఈ వైరస్ బారిన పడి దాదాపు వంద మందికి పైగా చనిపోయారు. ఈ వైరస్ భారత్‌లోనూ వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అదీ కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చే ప్రజలంతా ఎయిర్‌పోర్ట్‌లోనే తిరుగుతుంటారు. అందుకే సన్నీ ఫ్యాన్స్ సెల్ఫీ కావాలని అడిగినప్పుడు కాస్త వెనుకడుగు వేశారు. అయినా కూడా ఓ యువతి సెల్ఫీ కోసం సన్నీ వద్దకు వెళ్లగానే సన్నీ వెంటనే తన వద్ద ఉన్న మాస్క్‌తో ముక్కు, నోరు మూసేసుకున్నారు. దాంతో పక్కనే ఉన్న మరో మహిళ కోపంతో సెల్ఫీ దిగకుండానే వెళ్లిపోయారు. అయితే తాను ఫ్యాన్స్‌తో అలా ప్రవర్తించినందుకు ఏమాత్రం బాధపడటంలేదని సన్నీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ‘‘చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై అవగాహన పెంచుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కొరోనా వైరస్ మనకు ఎందుక వస్తుంది అని మాత్రం అనుకోకండి. స్మార్ట్‌గా ఉండండి, సేఫ్‌గా ఉండండి’ అని పేర్కొంటూ తన భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. విమానాశ్రయాల్లో కరోనావైరస్ వచ్చే అవకాశం ఉందని, అందువల్ల ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని సన్నీలియోన్ భర్త డేనియల్ కూడా కోరారు. చైనాతోపాటు థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్, అమెరికా, తైవాన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మకావ్, సౌత్ కొరియా, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, వియత్నాం, నేపాల్, కంబోడియా, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో సన్నీలియోన్ దంపతులు ముందుజాగ్రత్త చర్యగా ప్రజలు మాస్క్ ధరించాలని సూచించారు.

Related posts