telugu navyamedia
సినిమా వార్తలు

బ‌రిలోకి దిగిన బంగార్రాజు

యువ సామ్రాట్, అక్కినేని అంద‌గాడు నాగార్జునకు అమ్మాయిల ప్యాన్‌ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇక పోతే ఎప్పుడెప్పుడా వ‌స్తుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న బంగార్రాజు మూవీ సెట్స్ మీద‌కి వ‌చ్చేసింది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు నాగార్జున రెడీ అవుతున్నాడు.

‘బంగార్రాజు’. సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ చేయ‌బోతున్నారు.. 2016లో నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఆ సంక్రాంతి పండక్కి ఓ మంచి హిట్‌గా నిలిచింది. దీంతో ఈ సినిమాలో నాగార్జున పోషించిన ‘బంగార్రాజు’ అనే పేరు బాగా వైర‌ల్ అయ్యింది.

నాగార్జునకు జోడీగా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా, చైత‌న్య‌కు జోడీగా కృతి శెట్టి న‌టిస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మ‌నం సినిమా త‌రువాత మ‌ళ్ళీ తండ్రీ కొడుకులు ఒకే వేదిక‌పై సంద‌డి చేయ‌నున్నారు. ఈ సినిమా అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతుంది. ఈ నెల 20న షూటింగ్‌ను మొదలు పెట్టడానికి ప్లాన్‌ చేస్తున్నారని టాక్ . ఇప్ప‌టికే ఈ సినిమా కోసం ప్ర‌త్యేక‌మైన‌ సెట్స్ కూడా వేస్తున్న‌ట్టు స‌మాచారం.

గతేడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు. కానీ క‌రోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే గ్యాప్ లేకుండా షూటింగ్ చేసి సంక్రాంతి బ‌రిలో ‘బంగార్రాజు’ రాబోతున్న‌ట్టు ప్లాన్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.

Related posts