టాలీవుడ్‌లో హిట్ పెయిర్‌గా మంచి టాక్ తెచ్చుకున్న రాజ్ తరుణ్, అవికా గోర్‌లు ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల ముందు రానున్నారు. ‘ఉయ్యాలా జంపాలా’ వంటి ముచ్చటైన ప్రేమ కథతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచమయ్యారు రాజ్ తరుణ్, అవికా గోర్‌లు. తొలి చిత్రంతోనే హిట్ పెయిర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మరోసారి ‘సినిమా చూపిస్తా మామ’లోనూ కలిసి సందడి చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వీరి ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ ఫేమ్ డైరెక్టర్ శ్రీనివాస్ గవిరెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారని టాక్. గతంలో ఈ జంట నటించిన రెండు చిత్రాలు విజయాలు సాధించడం వల్ల హ్యాట్రిక్ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
previous post

