విరాట్ కోహ్లీ, అనుష్క జంట వివాహం జరిగినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో పలు మార్లు అనుష్క గర్భవతి అంటూ పలుమార్లు వదంతులు వినిపించాయి. అయితే ఈ వదంతులపై అనుష్క పలుమార్లు లైట్ తీసుకున్నప్పటికీ ఈ మధ్య కాలంలో తన వస్త్రధారణను గుర్తించి ఆమె గర్భంతో ఉన్నారా అని ప్రశ్నించడంపై అసహనం వ్యక్తం చేశారు. తాను గర్భవతి నంటూ వస్తున్న వదంతులపై అనుష్కా శర్మ ఘాటుగా స్పందించారు. పెళ్లయిన ఆడవాళ్లు వదులుగా దుస్తులు వేసుకుంటే వాళ్లు గర్భవతులేనా అని ప్రశ్నించారు. కాస్త డిఫరెంట్ గా ఉండేందుకు వేసుకొని ఉంటారని అనుకోవచ్చుగా అని అనుష్క శర్మ అన్నారు. సెలబ్రిటీలకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుందని, అలాంటప్పుడు వారి వ్యక్తిగత జీవితం గురించి అడిగి తెలుసుకోవడం ఎంత వరకూ సబబు అని అనుష్క అన్నారు.
							previous post
						
						
					
							next post
						
						
					

