మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మరో కేసు నమోదు అయ్యింది. జగన్ మిర్చి యార్డ్ పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కీలక నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.
గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డ్‌కు వెళ్లారు జగన్.
కానీ అనుమతి లేకుండా యార్డ్‌లోకి వచ్చి వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు. దీంతో జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్యాన్ పార్టీ నేతలకు 41 ఏ నోటీసులు అందజేస్తున్నారు.
మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి , అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేతలు పేర్నినాని, కొడాలి నాని, తలశిల రఘురాంతో పాటు జగన్‌పై గతంలోనే నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లోనే కేసు నమోదు అయ్యింది.
ఇప్పుడు నాలుగు నెలల తర్వాత అందుబాటులో ఉన్న నేతలకు నోటీసులు జారీ చేశారు. పిలిచినప్పుడు నల్లపాడు స్టేషన్‌కు విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు.
అందుకే ఆయనను పెళ్లి చేసుకున్నా: మంత్రి పుష్ప శ్రీవాణి