ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌లకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసినట్లు రాష్ట్ర ఫిలిం, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘‘కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్రంలో సినిమా షూటింగ్‌లను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆగస్టు 21న జారీచేసిన మార్గదర్శకాలు, స్టాండర్డు ఆపరేటింగ్ ప్రొసీజర్‌కు అనుగుణంగా రాష్ట్రంలో సినిమాల చిత్రీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం టెక్నీషియన్లు అందరూ తప్పక మాస్కులు ధరించాలని ఆయన స్పష్టం చేశారు. షూటింగ్ సమయంలో నటీనటులు మాస్కులు ధరించే విషయంలో కొంత మినహాయింపు ఉందన్నారు. సినిమాల చిత్రీకరణ సమయంలో చిత్రీకరణ పరికరాలు, యూటినిట్లు, సెట్లు అన్నీ తరచుగా శానిటైజ్ చేయాలన్నారు. టెక్నీషియన్లు, నటీనటులు అంతా హ్యాండ్ శానిటైజర్లను తప్పక వినియోగించాలని ఆయన తెలిపారు. సినిమాల చిత్రీకరణ సమయంలో సాంకేతికంగా అవకాశం లేని పరిస్థితుల మినహా మిగిలిన సమయాల్లో టెక్నీషియన్లు అందరూ ఆరు అడుగుల దూరాన్ని పాటించాల్సి ఉంటుందన్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణకై ప్రేక్షకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియపర్చే బహిరంగ సందేశాన్ని చిత్ర ప్రదర్శన ప్రారంభం, విరామ సమయాల్లో తప్పక ప్రదర్శించాల్సి ఉంటుందని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.
లిప్ లాక్ గురించి మాట్లాడితే… ఆ అమ్మాయితో పని కష్టం : యామీ గౌతమ్