telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అస్తమయం..

విలక్షణ రాజకీయనాయకులు, ఆంధ్రప్రదేశ్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఆర్థికమంత్రి గా, తమిళనాడు కు గవర్నర్ గా సేవలు అందించిన కొణిజేటి రోశయ్య అస్తమించారు. ఆయన వయసు 89సంవత్సరాలు.

రక్తప్రసరణలో వ్యత్యాసం, శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో ఇబ్బంది పడ్డారు. కోలివుడ్ బారినపడి కోలుకున్న రోశయ్య ను ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయి. కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్స్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. విపక్షంలో నూ, అధికారపక్షం లోనూ ఆయన వ్యవహారశైలి, హుందా తనం విభిన్నం. రాజకీయాల్లో అపారమైన అనుభవం ఆయన సొంతం.

Related posts