అనసూయ ప్రస్తుతం రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అభిమానులకు అందుబాటులో ఉంటోంది. యాంకర్ గా నటిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా జయప్రకాశ్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియావేదికగా గుర్తు చేసుకుంది. టీవీ ఛానెల్ లో పనిచేసే సమయంలో జయప్రకాశ్ రెడ్డి మాట్లాడే ఆకర్షణీయమైన యాసను అనుకరించే ప్రయత్నం చేసేదానిని. మీరు మా హృదయంలో ఎప్పటికీ ఉంటారు అని అనసూయ పేర్కొంది. అయితే జయప్రకాశ్ రెడ్డి బాత్రూంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మరణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . తాజాగా ఇందుకు సంబంధించి ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టింది అనసూయ. చివరకు బాత్రూంను కూడా వదలడం లేదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. ఈ రోజుల్లో మరణం విషయంలో కూడా డిగ్నిటీ అనేది లేకుండా పోయింది అని ట్వీట్ చేసింది అనసూయ.


నా తొడమీద పుట్టుమచ్చ చూసి చాలామంది పడిపోయారు… “నగ్నం” హీరోయిన్