telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బికినీ వేసుకొని నన్ను నేను చూసుకోలేను… స్టార్ హీరోయిన్ కామెంట్స్

Keerthy-Suresh

‘మహానటి’తో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న నటి కీర్తి సురేష్‌. ప్రస్తుతం ఆమె వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో ‘రంగ్‌ దే’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్‌ సఖి’.. మలయాళంలో ‘మరక్కర్’.. తమిళ్‌లో ‘పెంగ్విన్’, ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నట్లు సమాచారం. “మహానటి” క్రేజ్ ను కొనసాగించడం కోసం ఆచితూచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వాటిలో నటిస్తున్నారు. అయితే కెరీర్ ప్రారంభం నుంచి కాస్త బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల ఆమె బాగా సన్నబడ్డారు. దీనిపై రకరకాల పుకార్లు వినిపించాయి. ఓ మూవీ కోసం కీర్తి తగ్గిందన్న కామెంట్లు వినిపించాయి. అంతేకాదు బికినీ వేసుకునేందుకు సిద్ధమైన కీర్తి.. అందుకోసమే సన్నబడిందన్న వార్తలు కూడా వినిపించాయి. ఇక ఈ రూమర్లపై తాజాగా కీర్తి స్పందించారు. ”నేను సన్నబడ్డాలని తీసుకున్న నిర్ణయం ఇప్పటిది కాదు. చాలా రోజుల క్రితం తీసుకున్నది. దాదాపు ఒక సంవత్సరం కష్టపడి నేను సన్నబడ్డాను. తెరపై బికినీ వేసుకొని నన్ను నేను చూసుకోలేను. అది ఇష్టం లేకనే ఓ భారీ సినిమా ఆఫర్‌ను వదులుకున్నా” అని కీర్తి అన్నారు.

Related posts