దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ కొత్త చిత్రం గురించి ప్రకటన చేస్తానని నిన్న ట్విట్టర్ లో తెలిపిన విషయం తెలిసిందే. చెప్పినట్లే ఆయన కొత్త సినిమా పేరును ప్రకటించారు. తన కొత్త సినిమా పేరు పెళ్లి సందడి అని, ఇందులో నటించే వారి పేర్లను త్వరలోనే వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. ఈ సినిమాకు గేయ రచయిత చంద్రబోస్ పాటలు రాయనున్నారని తెలిపారు. ఆర్.కె.ఫిలింస్, ఆర్కా మీడియా వర్క్స్ పతాకాలపై సినిమా రూపొందనుంది. ఎం.ఎం.కీరవాణ సంగీతం అందించనున్న ఈ చిత్రానికి శివశక్తిదత్తా, చంద్రబోస్ పాటలను రాస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ ప్రొడక్షన్ ప్రారంభమైందని, త్వరలోనే నటీనటులెవరనే విషయాన్ని తెలియజేస్తామని ఆయన తెలిపారు. కొత్త నటీనటులతో దర్శకేంద్రుడు ఈ సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. కాగా, శ్రీకాంత్ హీరోగా అప్పట్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఘన విజయం సాధించి విషయం తెలిసిందే.
#PelliSandadi…
మళ్ళీ మొదలవ్వబోతుంది….
తారాగణం త్వరలో… pic.twitter.com/fvOqagnhpT— Raghavendra Rao K (@Ragavendraraoba) October 9, 2020