telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

4వ స్థానంలో ఎన్టీఆర్… 4 మిలియన్ల ఫాలోవర్స్…

ntr

ప్రస్తుతం స్టార్‌ హీరోలందరూ సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసుకొని అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ట్విట్టర్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇటీవల ఆయన ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్లకు చేరింది. కాగా ఆయన ఇప్పటివరకు రాజమౌళి ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఇక ఈ లిస్ట్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు మొదటి స్థానంలో ఉన్నారు. ఆయనకు 9.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఆ తరువాత రానా దగ్గుబాటి (5.9 మిలియన్‌ ఫాలోవర్లు), అల్లు అర్జున్ (4.5 మిలియన్‌ ఫాలోవర్లు) ఉన్నారు. ఇక పవన్ కల్యాణ్‌ కూడా 4 మిలియన్ ఫాలోవర్లకు దగ్గర్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయనను 3.9 మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. కాగా మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్ ఇటీవలే ట్విట్టర్‌లోకి రాగా.. వారి ఫాలోవర్ల సంఖ్య ఇంకా 1 మిలియన్‌ కూడా క్రాస్ అవ్వలేదు.

Related posts