telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణాకపూర్ ఆస్తుల జప్తు!

Rana Kapoor CEBIED Yes Bank

మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న యెస్ బ్యాంకు ప్రమోటర్ రాణా కపూర్‌కు లండన్‌లో ఉన్న రూ. 127 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. 2017లో 99 లక్షల పౌండ్ల (రూ.93 కోట్లు)కు డీఓఐటీ క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరిట రాణాకపూర్ ఈ ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు.

రాణాకపూర్ తన ఆస్తిని విక్రయించేందుకు ప్రణాళిక సిద్దం చేసినట్టు వెల్లడించారు. అందులో భాగంగా ఓ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ను కూడా నియమించుకున్నట్టు తెలిపారు. మోర్గాన్‌ క్రెడిట్‌ నిధుల సేకరణకు సంబంధించిన వివరాలను స్టాక్‌ మార్కెట్లకు వెల్లడించనందుకు రాణాకపూర్‌పై క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ కూడా కోటి రూపాయల జరిమానా విధించింది.

Related posts