మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్.. హను రాఘవపూడి దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పారు. మహానటి నిర్మాతలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీని సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని దర్శక నిర్మాతలు అనుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో మార్చి నుంచి షూటింగ్లకు బ్రేక్ పడింది. ఇప్పుడు కేసులు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సెట్స్ మీదకు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. దీంతో ఈ చిత్రాన్ని దుల్కర్ వాయిదా వేశారట. ముందుగా తాను ఒప్పుకున్న తమిళం, మలయాళ చిత్రాలను పూర్తి చేసిన తరువాతనే ఈ సినిమాలో నటించాలని ఈ హీరో అనుకుంటున్నారట. దీంతో కొద్ది రోజులు ఈ మూవీని వాయిదా వేయాలని ఆయన దర్శకనిర్మాతలకు సూచించినట్లు తెలుస్తోంది.
previous post