దాదాపు 2 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ ఇస్తోన్న పవన్ కల్యాణ్ 2024లో జరగనున్న ఎన్నికల కోసం రెండు సంవత్సరాల ముందు నుంచే ప్రచారం చేయాలని పవన్ భావిస్తున్నారట. కానీ లాక్డౌన్ నేపథ్యంలో మూవీ షూటింగ్లకు బ్రేక్ వచ్చింది. దీంతో ఇప్పుడు ఒప్పుకున్న ఈ మూడు చిత్రాలను పూర్తి చేయడానికే మరింత సమయం పట్టేలా ఉంది. ఈ క్రమంలో మరో సినిమాకు సంతకం చేయకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారట. దీంతో రెండు సినిమాలను ఆయన వదులుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్, క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నారు. వీటితో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రెండోసారి నటించబోతున్నారు పవన్.
previous post