ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయరు. నేను దాదాపు పదేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను కాబట్టి అసలు పట్టించుకోరు. మేం తెలుగులో మాట్లాడతాం కాబట్టి అంత పాష్‌గా అనిపించదు. అదే ఇంగ్లీష్‌లో మాట్లాడితే బాడీ లాంగ్వేజ్ మారుతుంది, అది పాష్‌గా అనిపిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడు వస్తున్న దర్శకులు తెలుగువాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు.ఇది కూడా మంచి పరిణామమే.‘‘నాకు రోజూ సినిమా అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ మేజర్ సమస్య రెమ్యునరేషనే. తెలుగు అమ్మాయిని కదా. అందుకే చాలా తక్కువ డబ్బు ఇస్తారు. అంత తక్కువ డబ్బు తీసుకుని నేను సినిమాలు చేయలేను. కష్టానికి తగ్గ ఫలితం అడుగుతాను. అంత ఇవ్వలేం అంటున్నారు. అందుకే నేను సినిమాలు చేయడం లేదు’’
సినిమాను ఆ నలుగురు కుటుంబాలే ఏలేస్తున్నారు. అది నూటికి నూరు శాతం నిజం. సొంతంగా సినిమా రిలీజ్ చేసుకోవాలంటే నానా కష్టాలు పడతారు, లేదంటే ఈ నాలుగు కుటుంబాలకే అమ్మేయాలి. ఒకప్పుడు సినిమాలో పెళ్లి అయినవారు కాని వారు అందరికీ ఛాన్సెస్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఇండస్ట్రీ అలా లేదు. పెళ్లైతే అవకాశాలు రావు. అలా ఎందుకు నియమం పెట్టుకున్నారో నాకు అర్థంకావడంలేదు.
హైపర్ ఆదిగారు తన స్కిట్‌లో గెస్ట్‌గా చేయాలని అన్నారు. కామెడీగా ఉంటుంది కదా అని నేను చేసాను. జబర్దస్త్ సెట్ చూడగానే ఓ జడ్జ్ సీట్ ఖాళీగా ఉంది వెళ్లి ఉంటే బాగుండేది అనిపించింది. జబర్దస్త్‌లో అడల్ట్ కంటెంట్ ఉంటుంది, చిన్న పిల్లలకు చూపించకండి అని క్లియర్‌గా చెప్పారు. మరో విషయం ఏంటంటే.. డబుల్ మీనింగ్స్‌ని నేను ఎంకరేజ్ చేయను కానీ ఆ పంచ్ డబుల్ మీనింగ్‌లా ఉంటేనే నవ్వు వస్తుంది. ఆడియన్స్ స్కిట్స్ చూస్తున్నారు, తిడుతున్నారు. అలాగని చూడటం మాత్రం మానేయడంలేదు. ఇప్పుడు అంత వల్గర్‌గా అనిపించడంలేదు.
previous post
next post