పండగ ప్రత్యేక బస్సుల పేరిట ఆర్టీసీ అధనపు చార్గీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా తమకు ఆదాయార్జనపై దృష్టి పెట్టింది. దసరా పండుగ రానున్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ భారీగా ఉండే అవకాశముండడంతో ప్లాట్ఫామ్ టిక్కెట్ల ధరను రెండు రెట్లు పెంచింది. ఇప్పటి వరకు ప్లాట్ఫామ్ టికెట్ ధర రూ. 10 గా ఉండగా దానిని రూ. 30 కి పెంచింది. ఈ పెంపు శనివారం నుంచే అమల్లోకి వస్తోంది. అక్టోబరు 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయి. విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లలో ఈ పెంపు ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.


నిరుద్యోగులపై కక్ష ఎందుకు.. జగన్ పై లోకేశ్ విమర్శలు