ప్రస్తుతం చెన్నై నగర ప్రజలు తాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్నారు. దేశంలోని ఆరవ పెద్ద నగరం చెన్నైలోని ప్రధాన జలాశయాలు అన్ని ఎండిపోవడంతో అక్కడి ప్రజలు దాహర్తితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ స్టార్ లియొనార్డో డికాప్రియో స్పందించడం పట్ల మంచు మనోజ్ కామెంట్స్ చేశారు. చెన్నై ప్రజల కోసం మనోజ్ తన స్నేహితులతో కలిసి మంచినీరు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. చెన్నై కోసం తాను ముందుకువచ్చానని, మీరు కూడా సాయం చేయండి అంటూ మనోజ్ ట్వీట్ చేయగా, దీనిపై నెటిజన్ల నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే, మంచు మనోజ్ నెటిజన్లపై ఫైర్ అయ్యారు. “నేను చెన్నైకి సాయపడడం కొందరు నెటిజన్లను నచ్చడంలేదు. అలాంటి వారి కోసమే ఈ పోస్టు. నేను చెన్నై ప్రజలకు సాయం చేస్తే మీరు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారా? ఎక్కడో ఉన్న ఓ హాలీవుడ్ నటుడు డికాప్రియో కూడా మన సమస్య పట్ల స్పందించారు. మీ తీరు పట్ల సిగ్గు పడండి. అతడికి ఉన్నంత జాలి కూడా మీకు లేదు. ముందు మనం మనుషులం. ఆ తర్వాతే జాతి, కులం, రాష్ట్రం” అంటూ పోస్ట్ చేశారు.
							previous post
						
						
					
							next post
						
						
					

