ఉత్తమ తెలుగు చలన చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరి ఏర్పాటు అయ్యింది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు.
దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇవ్వబోతోందని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు.
ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేశామని జయసుధ చెప్పారు. అవార్డులు తమకు బూస్ట్ ఇస్తాయని ప్రభుత్వం తమకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , భట్టి విక్రమార్క , కోమటిరెడ్డి , దిల్ రాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. 14 ఏళ్ల అనంతరం అవార్డులు ఇవ్వటం సంతోషమన్నారు.
బెస్ట్ ఆఫ్ బెస్ట్ కే అవార్డులు వస్తున్నాయని జయసుధ పేర్కొన్నారు.
గద్దర్ అవార్డులు విజేతలు
• ఉత్తమ చిత్రం – కల్కి
• ఉత్తమ రెండో చిత్రం – పొట్టేల్
• ఉత్తమ మూడో చిత్రం – లక్కీభాస్కర్
• ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప-2)
• ఉత్తమ నటి – నివేదా థామస్ (35 చిన్న కథకాదు)
• ఉత్తమ డైరెక్టర్ – నాగ్ అశ్విన్ (కల్కి)
• ఉత్తమ సహాయ నటుడు – ఎస్జే సూర్య (సరిపోదా శనివారం)
• ఉత్తమ సహాయ నటి – శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్బ్యాండ్)
• ఉత్తమ హాస్యనటుడు – సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా)
• ఉత్తమ సంగీత దర్శకుడు – బీమ్స్ (రజాకార్)
• ఉత్తమ స్టోరీ రైటర్ – శివ పాలడుగు
• ఉత్తమ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
• ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
• ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య (దేవర)
• స్పెషల్ జ్యూరీ అవార్డు – దుల్కర్ సల్మాన్ (లక్కీభాస్కర్)
• స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగళ్ల
• బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ – యధువంశీ (కమిటీ కుర్రాళ్లు)

