telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కౌంటింగ్ రోజు వైసీపీ చేసే దాడులకు జనసైనికులు సంయవనం పాటించి అధికారులకి సహకరించండి: నాగబాబు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి.

అదే సమయంలో రాజకీయ పార్టీలు కూడా కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తమ ఏజెంట్లకు శిక్షణ ఇస్తున్నాయి.

కౌంటింగ్ రోజు జనసైనికులు ఎలా ఉండాలన్న దానిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఓ వీడియో రిలీజ్ చేశారు.

“రాబోయే కూటమి గెలుపుని ఓర్వలేక,ఓటమి భారాన్ని తట్టుకోలేక ఓట్ల లెక్కింపు రోజున వైసిపి చేసే ఏ దాడినైన సంయవనంతో జయించండి అధికారులకి సహకరించండి” అని తెలిపారు.

జనసైనికులకు, వీర మహిళలకు, నాయకులకు, పిఠాపురం జనసేన నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి విజయానికి చేరువలో ఉందని నాగబాబు తెలిపారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందన్నారు. ఎప్పుడైతే ఓ మనిషైనా ఓడిపోతాడని తెలిస్తే ఫ్రస్ట్రేషన్ ఉంటుందని,హింసకు, గొడవలకు సిద్ధమవుతుంటారని నాగబాబు తెలిపారు

Related posts