మేషరాశి..
దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. మిత్రులతో కలహాలు సూచనలున్నవి.
వృషభరాశి..
రుణదాతల నుండి ఋణ వత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.
మిథునరాశి..
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ విషయమై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
కర్కాటకరాశి..
బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.
సింహరాశి..
అనారోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.
.
కన్య రాశి..
ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
తులరాశి..
స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. విద్యార్దులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది.
వృశ్చికరాశి..
ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.
ధనుస్సురాశి..
బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.యి.
మకరరాశి..
చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున చికాకులు పెరుగుతాయి.
కుంభరాశి..
నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది.
మీనరాశి..
ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి తగిన గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆదాయం పెరుగుతుంది.

