telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 25 (బుధవారం) రాశి ఫలాలు

మేషం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. ఉద్యోగంలో అభివృద్ధికి అవకాశం. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శిస్తారు. బంధువులతో విభేదాలు మంచిది కాదు. శారీరక శ్రమ పెరుగుతుంది. వ్యాపారులకు మధ్యస్థంగా ఉంటుంది.

వృషభం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఖర్చులను అదుపుచేయాలి. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలం.

మిథునం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతా యి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభ కార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అనుకూలం. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటకం: శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు మధ్యస్థంగా ఉంటుంది. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశం. మనోధైర్యం కోల్పోవద్దు.

సింహం: ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. శుభవార్తలు వింటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. తలపెట్టిన పనుల్లో ఆటంకం ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహా పాటించండి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఎవరికీ హామీలు ఇవ్వొద్దు.

కన్య : ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభకార్యాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు గురించి కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులకు అనుకూలం.

తుల: ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన పనులు ప్రణాళికతో పూర్తిచేస్తారు. వ్యాపారులకు మధ్యస్థంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. స్నేహితుల సహకారం తీసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విందు, వినోదాల్లో పాల్గొంటారు.

వృశ్చికం: ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఉంటాయి. అదనపు ఆదాయం కోసం శ్రమ పడతారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండండి. వ్యాపారులకు అనుకూలం. వివాహ సంబంధాలకు అనుకూలం. ఎవరికీ హామీలు ఉండొద్దు.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. తలపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల సహకారం అందుతుంది. వ్యాపారులకు మధ్యస్థంగా ఉంటుంది. తోటివారితో సన్నిహితంగా ఉండాలి. వివాదాలకు తావివ్వొద్దు.

మకరం: ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులకు అనుకూలం. వివాహ సంబంధాలకు అనుకూలం. దూర ప్రయాణాలు చేస్తారు.

కుంభం: ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలం. ఎవరికీ హామీలు ఉండొద్దు. కోర్టు కేసుల్లో అనుకూలత ఉంటుంది.

మీనం: ఉద్యోగంలో మార్పులకు అవకాశం. అప్పులు తీరుస్తారు. స్నేహితులకు సహాయం చేస్తారు. శుభవార్తలు వింటారు. వ్యాపారులకు అనుకూలం. వ్యాపారులు, స్వయం ఉపాధివారికి అనుకూలం. ఉత్సాహంగా గడుపుతారు.

Related posts