పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భీమ్లానాయక్’తో అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రానా-పవన్‌కల్యాణ్ షూట్లో పాల్గొంటున్నారు. చిత్రీకరణ సమయంలో చిన్న విరామం దొరకడంతో పవన్ గన్ చేతపట్టారు. టార్గెట్‌ని ఎయిమ్ చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా షేర్ చేసింది చిత్రబృందం. ‘భీమ్లా నాయక్ ఇన్ బ్రేక్ టైమ్’ అని పేర్కొంది.
మలయాళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ రెడీ అవుతుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లే, తమన్ సంగీతం. అందిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న విడుదల కానుంది.