telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన అనుపమ పరమేశ్వరన్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు ప్రముఖ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉధృతంగా కొనసాగుతుంది. అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. అయితే తాజాగా ఈ ఛాలెంజ్ లో భాగంగా బాచుపల్లి లో మొక్కలు నాటింది దక్షిణ భారత సినీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అనంతరం అనుపమ మాట్లాడుతూ… జోగినపల్లి సంతోష్ కుమార్ నుంచి ప్రేరణ తీసుకొని హీరో నిఖిల్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటనని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది. అడవులు మరియు పర్యావరణాన్ని కాపాడటానికి ఎంపి సంతోష్ చేసిన అద్భుతమైన ఉద్యమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని తెలిపారు. అనంతరం మరో ముగ్గురుకి సోషల్ వేదిక ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను విసురుతానని చేస్తానని తెలిపింది.ఈ కార్యక్రమంలో మమత హాస్పిటల్ ఎం.డి డా. పువ్వాడ నయన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. అయితే అనుపమ ఇప్పుడు ఎవరికీ ఈ చల్లెన్గ్ విసరనుంది అనేది చూడాలి.

Related posts