telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య, బోయపాటి చిత్రంలో సునీల్ కీలకపాత్ర…!

Sunil

బాలయ్య, బోయపాటి శ్రీను కాంబో ప్రస్తుతం ఓ చిత్రం తెరకెక్కనుంది. బాలయ్య, బోయపాటి కాంబోలో గతంలో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సంచలన విజయాలు నమోదు చేశాయి. ఇప్పడు కూడా సినిమాపై భారీ బజ్ నెలకుంది. అందులోనూ తన సినిమాల్లో కామెడీ కోసం స్పెషల్ ట్రాక్ రాసుకుంటాడు బోయపాటి. అందులో సునీల్‌ను బాలయ్య ఫ్రెండ్ పాత్రకిగానూ సెలక్ట్ చేసుకున్నాడట దర్శకుడు. ఇప్పటికైతే కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సునీల్ తన మార్క్ ఓల్డ్ కామెడీతో నవ్వించిన సినిమాలు రాలేదు. మరి బోయపాటి, సునీల్‌ పాత రోజులను తిరిగి తీసుకువస్తాడేమో వేచి చూడాలి. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. హీరోగా హిట్స్ లేక అలసిపోయిన సునీల్..మళ్లీ కయెడియన్ కమ్ నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అదే ట్రాక్ కొనసాగిస్తూ..ఇటీవలే ‘అల వైకుంఠపురంలో’, ‘డిస్కో రాజా’ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. అయితే సునీల్ రీసెంట్‌గా అనారోగ్యానికి గురైయ్యాడు. ఇప్పుడే కొద్ది కొద్దిగా రికరవుతున్నాడు. అయితే ఇతడికి సినిమా ఛాన్సులు మాత్రం ఆగడం లేదు. తాజాగా ‘కలర్ ఫోటో’ అనే చిన్న బడ్జెట్ మూవీ ఒప్పకున్న సునీల్..అందులో తన చిరకాల కోరిక అయిన విలన్ రోల్‌లో కనిపించబోతున్నాడు.

Related posts