telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సూర్య సినిమాలో కట్టప్ప !

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలైంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. ఈ సినిమా తెలుగులోనూ బంపర్‌ హిట్‌ కొట్టింది. అయితే.. ‘ఆకాశం నీ హద్దురా’ తరువాత సూర్య దూకుడు పెంచాడు. వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నాడు. ఇప్పటికే మణిరత్నం కోసం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తొలి వెబ్ సిరీస్ లో నటించాడు. ‘నవరస’ పేరుతో మణిరత్నం ఈ సిరీస్ నిర్మిస్తున్నాడు. అలాగే, జ్ఞానవేల్ దర్శకత్వంలోనూ సూర్య మరో సినిమా చేస్తున్నాడు. దానికి ఆయనే నిర్మాత కూడా. ఇవి కాకుండా సన్ పిక్చర్స్ నిర్మాణంలో త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందీ ‘సూర్య40’ ప్రాజెక్ట్! ‘సూర్య40’ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చనున్నాడు. అయితే, అన్నిటి కంటే పెద్ద ట్విస్ట్ ఏంటంటే… మన కట్టప్ప… సూర్య 40వ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నాడట. వీరిద్దరి కాంబినేషన్ గతంలో ఎప్పుడూ వర్కవుట్ కాలేదు. సూర్య సినిమాలో సత్యరాజ్ నటించటం…. ఇదే తొలిసారి! 

Related posts