telugu navyamedia
crime news Telangana telugu cinema news trending

హైదరాబాద్ : … క్యూనెట్ కేసులో .. సినీప్రముఖులకు నోటీసులు..

qnet case : notices to movie stars

క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీం దందాపై సైబరాబాద్ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీతో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. దీంట్లో భాగంగా ఈ సంస్థల ప్రచారంలో పాల్గొన్న సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు అనిల్‌కపూర్, షారూక్‌ఖాన్, బొమ్మన్ ఇరానీ, జాకీ ష్రాఫ్, పూజా హెగ్డే, వివేక్ ఒబెరాయ్, అల్లు శిరీష్ , ఇంకా పలువురిని విచారించేందుకు గతంలో నోటీసులు జారీ చేసినా రాక పోవడంతో మళ్లీ నోటీసులు జారీ చేశారు. నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన పత్రాలను తీసుకురావాలని కోరారు.

అనిల్ కపూర్, షారూ క్ ఖాన్, బొమ్మన్ ఇరానీల తరపు న్యాయవాదులు హాజరై తాము కేవలం ఈ కంపెనీ సేవా కార్యక్రమాలు(చారిటీ) నిర్వహిస్తున్న వాటికి హాజరయ్యామని వివరణ ఇచ్చారు. ఈ సమాధానం సమగ్రంగా లేకపోవడంతో సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేస్తున్నట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ నోటీసులను నిర్లక్ష్యం చేస్తే సెక్షన్ 175 కింద చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.

Related posts

మహర్షి అదుర్స్ .. ప్రీమియర్ షో టాక్..

vimala p

విజయవాడ : … లలితా త్రిపుర సుందరీదేవిగా … అమ్మ ..

vimala p

22 : “మార్ మార్ కె జీనా హై…” సాంగ్ విడుదల చేసిన యంగ్‌ రెబల్ స్టార్ ప్ర‌భాస్

vimala p